పాకిస్థాన్ బౌలింగ్ కోచ్‌లుగా ఉమ‌ర్ గుల్, అజ్మల్..

వన్డే వరల్డ్‌ కప్‌లో బాబ‌ర్ ఆజాం సేన దారుణ వైఫ‌ల్యంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చ‌ర్యలు చేప‌ట్టింది

Update: 2023-11-21 10:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్‌ కప్‌లో బాబ‌ర్ ఆజాం సేన దారుణ వైఫ‌ల్యంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చ‌ర్యలు చేప‌ట్టింది. బౌలింగ్ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ త‌ప్పుకోవ‌డం.. మ‌రో ఏడు నెల‌ల్లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఉన్నందున అత‌డి స్థానంలో త‌మ దేశానికే చెందిన ఉమ‌ర్ గుల్, స‌యాద్ అజ్మల్‌‌ను కోచ్‌లుగా నియ‌మించింది. మంగ‌ళ‌వారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బౌలింగ్ కోచ్‌లుగా నియ‌మించింది. ఈ మేర‌కు పీసీబీ ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. గుల్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌కు, అజ్మల్ స్పిన్ యూనిట్‌కు కోచింగ్ ఇవ్వనున్నారు. పాకిస్థాన్ జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్యట‌న‌తో వీళ్లకు తొలి ప‌రీక్ష ఎదుర‌వ్వనుంది. డిసెంబ‌ర్ తొలి వారంలో షాన్ మసూద్ సార‌థ్యంలోని పాక్ బృందం ఆసీస్‌కు వెళ్లనుంది. పీసీబీ ఈ టూర్ కోసం 18 మంది ఆట‌గాళ్లను ఎంపిక‌ చేసింది. అక్కడ ఒక వామ‌ప్ మ్యాచ్‌తో క‌లిపి పాక్ మూడు టెస్టుల సిరీస్ ఆడ‌నుంది.

ఉమ‌ర్ గుల్ గ‌తంలో కోచ్‌గా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌, ఆ త‌ర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్‌కు గుల్ కోచ్‌గా ఉన్నాడు. గుల్ త‌న 13 ఏండ్ల కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో 427 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మాజీ వ‌ర‌ల్డ్ నంబర్ బౌల‌ర్ అయిన అజ్మల్ పాక్ త‌ర‌ఫున 35 టెస్టులు, 113 వ‌న్డేలు, 64 టీ20లు ఆడాడు. మొత్తంగా 447 వికెట్లు తీశాడు. అజ్మల్ కూడా పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ జ‌ట్టుకు కోచ్‌గా సేవ‌లందించాడు.

Tags:    

Similar News