Tody Ronald Jones: సిక్స్‌ కొట్టి అదే బంతికి ఔట్.. ఎలాగో చూడండి..!

Update: 2023-07-26 12:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2023 డివిజన్‌ వన్‌ పోటీల్లో భాగంగా వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్ జోన్స్ వింత పద్ధతిలో ఔటయ్యాడు. ఎడ్‌ బెర్నార్డ్‌ బౌలింగ్‌లో 15వ బంతిని సిక్సర్‌గా మలిచిన టోబీ.. అదే బంతికి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. భారీ సిక్సర్ బాదిన అతను అదే ఆనందంలో వెనక్కి జరుగుతూ బ్యాట్‌ను స్వింగ్ చేశాడు. కానీ వెనుక వికెట్లు ఉన్నాయనే విషయం మరిచిపోయాడు. బ్యాట్ వెనక్కి అంటున్నక్రమంలో వికెట్లను తాకింది. ఈ విషయాన్ని గమనించిన వికెట్ కీపర్ అప్పీల్ చేయగా.. రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. టోబీ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అత్యంత అరుదైన హిట్ వికెట్‌గా ఇది క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుందని కామెంట్ చేస్తున్నారు.


Similar News