Tim Southee: కివీస్ కు బిగ్ షాక్ ..కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి తప్పుకున్న సౌథీ

టీమిండియా(Team India)తో టెస్ట్ సిరీస్ కు ముందు న్యూజిలాండ్(New Zealand)కు బిగ్ షాక్ తగిలింది

Update: 2024-10-02 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్:టీమిండియా(Team India)తో టెస్ట్ సిరీస్ కు ముందు న్యూజిలాండ్(New Zealand)కు బిగ్ షాక్ తగిలింది.ఆ జట్టు కెప్టెన్ టిమ్ సౌథీ(Tim Southee) సంచలన నిర్ణయం తీసుకున్నాడు.టెస్ట్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.35 ఏళ్ల ఈ స్పీడ్ బౌలర్ ఇప్పటివరకు 14 టెస్టుల్లో కివీస్ జట్టుకు నాయకత్వం వహించాడు. అందులో 6 మ్యాచులు గెలవగా,6 మ్యాచులు ఓటమి చెందింది. మరో 2 టెస్టులు డ్రాగా ముగిసాయి.కాగా సౌథీ 2022లో కేన్ విల్లియమ్స్(Kane Williams) నుంచి జట్టు సారథి బాధ్యతలు అందుకున్నాడు.అయితే ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో కివీస్ ఘోర ఓటమిపాలైంది.దీంతో సౌథీ కెప్టెన్సీపై చాలా విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. దీంతో న్యూజిలాండ్ తదుపరి టెస్ట్ సారథిగా వికెట్ కీపర్ టామ్ లేథమ్(Tom Latham) ను ఎంపిక చేస్తూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు(NCB) నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నెల 16 నుంచి టీమిండియాతో కివీస్ మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడనుంది.ఈ సిరీస్ కు లేథమ్ నాయకత్వం వహిస్తాడని కివీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.ఇప్పటివరకు న్యూజిలాండ్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వహించే అవకాశం ఇచ్చినందుకు సౌథీ ధన్యవాదాలు తెలిపాడు.


Similar News