చరిత్ర సృష్టించిన యువ బ్యాటర్.. ఒక్కడే 426 పరుగులు
కల్నల్ CK నాయుడు ట్రోఫీలో హర్యానా ఓపెనర్, యువ బ్యాటర్ యశ్వర్ధన్ దలాల్ చరిత్ర సృష్టించారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 426 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
దిశ, వెబ్‌డెస్క్: కల్నల్ CK నాయుడు ట్రోఫీ(Colonel CK Naidu Trophy)లో హర్యానా ఓపెనర్, యువ బ్యాటర్ యశ్వర్ధన్ దలాల్(Yashwardhan Dalal) చరిత్ర సృష్టించారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 426 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ గత సీజన్‌లో ఉత్తరప్రదేశ్(Uttarapradesh) తరఫున సమీర్ రిజ్వీ(Sameer Rizvi) చేసిన 312 పరుగులను అధిగమించి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్ గా యశ్వర్ధన్ దలాల్ (Yashwardhan Dalal) నిలిచాడు. ఈ మ్యాచులో యశ్వర్ధన్ దలాల్ మొత్తం 46 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి, సుల్తాన్‌పూర్‌లోని గురుగ్రామ్ క్రికెట్ గ్రౌండ్‌లో 2వ రోజు ముగిసే సమయానికి హర్యానా 8 వికెట్ల నష్టానికి 732 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది, అయితే వారి బౌలర్లు యశ్వర్ధన్ దలాల్, అతని ఓపెనింగ్ పార్టనర్ అర్ష్ రంగా నుండి ధాటికి పోరాడారు. వీరిద్దరూ కలిసి 410 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం రంగా 151 పరుగులతో అధర్వ భోసలే ఔటయ్యాడు. అయినప్పటికీ.. దలాల్ తన మెరుపులు కొనసాగించాడు. దూకుడుగా ఆడాడు.. మరో ఎండ్‌లో వికెట్లు పడిపోయినప్పటికి హర్యానా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.