వరల్డ్ చాంపియన్‌షిప్‌కు భారత టేబుల్ టెన్నిస్ టీమ్ ఎంపిక

సౌతాఫ్రికాలో నేటి నుంచి 57వ వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ప్రారంభకాబోతుంది.

Update: 2023-05-19 14:04 GMT
వరల్డ్ చాంపియన్‌షిప్‌కు భారత టేబుల్ టెన్నిస్ టీమ్ ఎంపిక
  • whatsapp icon

న్యూఢిల్లీ : సౌతాఫ్రికాలో నేటి నుంచి 57వ వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ప్రారంభకాబోతుంది. ఈ టోర్నీలో భారత్ తరఫున 11 మంది ప్యాడ్లర్స్ పాల్గొననున్నారు. అందులో స్టార్ ప్లేయర్లు శరత్ కమల్, సత్యన్ జ్ఞానేశ్వరన్, మనికా బాత్రా‌ ఉండగా.. తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ కూడా చోటుదక్కించుకుంది. గతేడాది శ్రీజ కామన్వెల్ గేమ్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. అలాగే, మానుష్ షా, హర్మీత్ దేశాయ్, సుతీర్థ ముఖర్జీ, రీత్ టెన్నిసన్, అర్చన్ కామత్, దియా చితాలే, మానవ్ ఠక్కర్ కూడా ఉన్నారు. 1926 వరల్డ్ చాంపియన్‌షిప్‌ ప్రారంభ ఎడిషన్‌లో భారత్ రెండు పతకాలు సాధించగా.. ఇప్పటివరకు మరో పతకం దక్కించుకోలేకపోయింది. ఈ సారి భారత్ నుంచి బలమైన జట్టు పోటీలో ఉండటంతో పతక ఆశలు భారీగానే ఉన్నాయి.

Tags:    

Similar News