థాయిలాండ్ మాస్టర్స్‌లో ముగిసిన అష్మిత పోరాటం

థాయిలాండ్ మాస్టర్స్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణి అష్మిత చాలిహా పోరాటం ముగిసింది.

Update: 2024-02-03 16:14 GMT

దిశ, స్పోర్ట్స్ : బ్యాంకాక్‌లో జరుగుతున్న థాయిలాండ్ మాస్టర్స్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణి అష్మిత చాలిహా పోరాటం ముగిసింది. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన ఆమె సెమీస్‌లో ఓటమిపాలైంది. శనివారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో అష్మిత 13-21, 12-21 తేడాతో 4వ సీడ్, థాయిలాండ్ క్రీడాకారిణి సుపానిడా కతేథాంగ్ చేతిలో పరాజయం పాలైంది. వరల్డ్ నం.61 ర్యాంకర్ అయిన అష్మిత.. వరల్డ్ నం.17 కతేథాంగ్‌ దూకుడు ముందు నిలువలేకపోయింది. 35 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించింది. తొలి గేమ్‌లో పూర్తి తేలిపోయిన అష్మిత.. రెండో గేమ్‌ ఆరంభంలో ప్రత్యర్థికి గట్టిపోటినిచ్చింది. ఒక దశలో 7-6తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని సమం చేసే దిశగా వచ్చిన ఆమె.. ఆ తర్వాత వరుస తప్పిదాలతో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ కోల్పోయింది. సెమీస్‌లో అష్మిత ఓటమితో టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం కూడా ముగిసింది. ఇప్పటికే సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జ్ ఇంటిదారిపట్టగా..మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి, తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప జంటలు ఓటమిపాలయ్యాయి.

Tags:    

Similar News