పసికూనపై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా.. రెండో టీ-20లో జింబాబ్వేపై ఘన విజయం

పసికూన జింబాబ్వేపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఐదు మ్యాచుల టీ-20లో సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచులో 100

Update: 2024-07-07 15:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: పసికూన జింబాబ్వేపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఐదు మ్యాచుల టీ-20లో సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచులో 100 పరుగుల తేడాతో విజయం సాధించి ఫస్ట్ మ్యాచ్ ఓటమికి రివేంజ్ తీర్చుకుంది. జింబాబ్వేలోని హరారే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (100) సెంచరీతో చెలరేగగా, రుతురాజ్ గైక్వాడ్ 77, రింకూ సింగ్ 48 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో మహరాబానీ, సికిందర్జా చెరో వికెట్ తీశారు.

అనంతరం 235 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు మొదటి నుండే కట్టడి చేశారు. టీమిండియా బౌలర్ల దాటికి జింబాబ్వే బ్యాటర్లు పెవిలియన్ క్యూ కట్టారు. 18.4 ఓవర్లో 134 పరుగుల చేసి ఆలౌట్ అయ్యారు. తద్వారా భారత్ 100 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో ముకేష్ కుమార్, అవేశ్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్ 2, సుందర్ ఒక వికెట్ సాధించారు. తాజా విజయంతో ఐదు మ్యాచుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. 


Similar News