Manmohan Singh : మన్మోహన్‌ సింగ్‌కు టీమ్ ఇండియా ఘన నివాళి

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు

Update: 2024-12-27 07:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో ఉన్న భారత క్రికెట్‌ జట్టు (Indian Cricket Team) సైతం మన్మోహన్‌కు నివాళులర్పించింది. మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా మెల్‌బోర్న్‌ బాక్సింగ్ డే టెస్ట్‌లో రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమ్‌ ఇండియా ఆటగాళ్లంతా చేతికి నల్లబ్యాండ్‌లు (black armbands) ధరించి సంతాపం తెలిపి బరిలోకి దిగారు. ఈ మేరకు ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లతో ఉన్న ఫొటోలను బీసీసీఐ (BCCI) ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది.

మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌ లో ఆస్ట్రేలియా 474 ర‌న్స్‌కు ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా ఆట ముగిసే సమయానికి రెండో రోజు 5 వికెట్ల న‌ష్టానికి 164 ర‌న్స్ చేసి కష్టాల్లో పడింది. పంత్ 6, జ‌డేజా 4 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్‌ జైశ్వాల్‌(82) హాఫ్‌ సెంచరీ చేసి రనౌట్ గా వెనుతిరిగాడు. కోహ్లీ 36 ర‌న్స్ చేసి నిష్క్రమించాడు, రోహిత్(3), కేఎల్ రాహుల్(24), ఆకాశ దీప్(0) కూడా తక్కువ స్కోర్ కే అవుటవ్వగా టీమ్ ఇండియా కష్టాల్లో పడింది.

Tags:    

Similar News