టీ20 ప్రపంచకప్: న్యూయార్క్ నుంచి స్టేడియానికి డ్రాప్ ఇన్ పిచ్ ల తరలింపు
టీ20 ప్రపంచ కప్ కోసం డ్రాప్ ఇన్ పిచ్ లు సిద్ధమయ్యాయి. ఫ్లోరిడా నుంచి ట్రక్కుల్లో న్యూయార్క్ కు పిచ్ లను తరలిస్తున్నారు.
దిశ, స్పోర్ట్స్: టీ20 ప్రపంచ కప్ కోసం డ్రాప్ ఇన్ పిచ్ లు సిద్ధమయ్యాయి. ఫ్లోరిడా నుంచి ట్రక్కుల్లో న్యూయార్క్ కు పిచ్ లను తరలిస్తున్నారు. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడింయలో డ్రాప్ ఇన్ పిచ్ ల ఇన్ స్టాలేషన్ చేయనున్నారు. ఆ స్టేడియంలోనే జూన్ 9న దాయాదుల పోరు జరగనుంది.
డిసెంబరు నుంచే ఫ్లోరిడాలో పది డ్రాప్-ఇన్ పిచ్‌లు సిద్ధం చేసినట్లు తెలిపింది ఐసీసీ. అడిలైడ్ ఓవల్ లోని సాంకేతికతల ఆధారంగానే పిచ్ ని తయారు చేశారు. ప్రఖ్యాత అడిలైడ్ ఓవల్ హెడ్ క్యూరేటర్ డామియన్ హగ్ నేతృత్వంలోని అడిలైడ్ ఓవల్ టర్ఫ్ సొల్యూషన్స్ పిచ్ లను తయారు చేపట్టింది. నసావు స్టేడియంలో నాలుగు పిచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ప్రాక్టీస్ కోసం అదనంగా ఆరు పిచ్ లు తయారు చేయనున్నట్లు తెలిపింది ఐసీసీ.
టోర్నమెంట్ పూర్తయ్యే వరకు అడిలైడ్ ఓవల్ టర్ఫ్ సొల్యూషన్స్ టీం పిచ్ నిర్వహణలో గ్రౌండ్స్ సిబ్బందికి సహాయం చేసందుకు న్యూయార్క్ లో నే ఉండనున్నారు. ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ మాట్లాడుతూ.. పిచ్ ల ఇన్ స్టాలేషన్ అనేది ఈ ప్రాజెక్టులో చివరి అంకం అని.. దాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తామన్నారు. న్యూయార్క్ కు పిచ్ ల రాకను చూసి సంతోషిస్తున్నామన్నారు అడిలైడ్ ఓవల్ హెడ్ క్యూరేటర్ హగ్. ల్యాండ్ టెక్ వంటి గొప్ప భాగస్వామ్యులతో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉందన్నారు.