విజృంభించిన జడేజా, సుందర్.. న్యూజిలాండ్ ఆలౌట్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం అయింది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
దిశ, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం అయింది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో మొదటి మూడు వికెట్లను వెంటవెంటనే కోల్పోయినప్పటికీ.. నాలుగో వికెట్ పై భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అయినప్పటికి భారత స్పిన్నర్లు జడేజా, సుందర్ లో తమ బాల్ తో రెచ్చిపోయారు. దీంతో న్యూజిలాండ్ జట్టు మూడో సెషన్ వరకు 65 ఓవర్లను ఆడి.. 235 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు తీసుకోగా.. సుందర్ 4 వికెట్లతో రాణించాడు. అలాగే ఆకాష్ దీప్ 1 వికెట్ పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్‌ను 235 పరుగులకు కట్టడి చేయగలిగారు. ఇదిలా ఉంటే భారత్ రెండు టెస్టులో పేలవమైన ఆటతీరుతో.. టెస్ట్ సిరీస్ ను చేజార్చుకుంది. దీంతో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే భారత్ తరుదపి ఆరు గేముల్లో మొత్తం 4 మ్యాచులు విజయం సాధించాల్సి ఉంది. లేదా.. ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్ ఆడే ప్రతి మ్యాచ్ లో విజయం సాధించడమే లక్ష్యంగా చేసుకోని ఆడాల్సి ఉంది. మరీ న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ గెలుస్తుందా.. లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.