SRH vs RR IPL మ్యాచ్... సన్ రైజర్స్ పరుగుల వరద

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య ఐపీఎల్ 2025 మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం(Uppal Rajiv Gandhi International Stadium)లో జరుగుతున్న విషయం తెలిసిందే.

Update: 2025-03-23 11:33 GMT
SRH vs RR IPL మ్యాచ్... సన్ రైజర్స్ పరుగుల వరద
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య ఐపీఎల్ 2025 మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం(Uppal Rajiv Gandhi International Stadium)లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్.. పరుగుల వరద పారిస్తోంది. 10 ఓవర్లలో సన్ రైజర్స్ 135/2 చేసి భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ట్రావిస్ హెడ్(Travis Head) 9 ఫోర్లు, 3 సిక్సులతో చెలరేగి పోయాడు. 21 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. జోఫ్రా వేసిన ఓ ఓవర్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు బాదాడు.

ఇందులో ఒక సిక్స్ ఏకంగా 105 మీటర్లు బాదడంతో స్టేడియంలో ట్రావిస్ మారుమోగిపోయింది. ఇషాన్ రెడ్డి కూడా తోడవ్వడంతో ఇద్దరు కలిసి స్కోర్ వందకు చేరువ చేశారు. ట్రావిస్ అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ కు వచ్చాడు. ఇక అప్పటి నుంచి ఇషాన్ సిక్సుల మోత మోగించాడు. ప్రస్తుతం 15 ఓవర్లకు 208/3 కొనసాగుతోంది. రాజస్థాన్ జట్టులో మహిష్ రెండు, తుషార్ ఒక వికెట్ తీశారు. 

Tags:    

Similar News