మనసు చలించే బాక్సింగ్.. కనిపించని శత్రువుతో ఇలా ఫైట్! (వీడియో)
నెటిజన్ల హృదయాలను కలిచి వేస్తూ, కన్నీళ్లు తెప్పిస్తుంది. South African boxer dies of brain injury following a bout.
దిశ, వెబ్‌డెస్క్ః బాక్సింగ్ ఆడాలంటే మెదడు, శరీరం చాలా యాక్టీవ్‌గా ఉండాలి. క్షణం పాటు మెదడు మరోవైపు మళ్లిందంటే ముఖంపై పిడిగుద్దు ధబ్‌మని పడుతుంది. అందుకే బాక్సర్ రింగ్‌లో ఎంతో స్పృహతో ఉండాలి. కానీ, ఇక్కడ మాత్రం ఓ బాక్సర్ మెదడు మైమరపులోకి జారింది. ఆ తర్వాత ఇలా మనసు చలించే సంఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఒక బాక్సర్ రింగ్‌లో పోటీ జరుగుతుండగా హటాత్తుగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు. తన ప్రత్యర్థిని మరిచిపోయి, రింగ్‌లోని ఖాళీ మూలల్లోకి వెళ్లి, గాలితో ఫైట్ చేయడం ప్రారంభించాడు. చివరకు, మెదడు గాయంతో మరణించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల హృదయాలను కలిచి వేస్తూ, కన్నీళ్లు తెప్పిస్తుంది.
ఈస్ట్ సిటీ డర్బన్‌లో ఆదివారం జరిగిన బౌట్ తర్వాత లైట్ వెయిట్ బాక్సర్ సిమిసో బుథెలెజీ మంగళవారం రాత్రి మరణించినట్లు దక్షిణాఫ్రికా బాక్సింగ్ సంస్థ బుధవారం వెల్లడించింది. దీనికి ముందు అతడు కోమాలో ఉన్నట్లు ప్రకటించింది. అప్పటి వరకూ ప్రత్యర్థికి చుక్కలు చూపించిన బుథెలెజీ చివరిదైన 10వ రౌండ్‌లో హటాత్తుగా వింతగా ప్రవర్తించడం ప్రారంభించాడు. గాలిలో బాక్సింగ్ చేస్తూ, కుప్పకూలి పోతున్న అతణ్ని రిఫరీ పట్టుకున్నాడు. మెదడులో అంతర్గత రక్తస్రావం కావడంతో బుథెలెజీని ఆసుపత్రిలో చేర్చిన కొన్ని గంటల్లో మరణించాడు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలోని జాతీయ టెలివిజన్‌లో బుథెలెజీ బాక్సింగ్‌ను ప్రతిభను ప్రదర్శించారు. ఈ ఘటనపై, దక్షిణాఫ్రికా బాక్సింగ్ స్వతంత్ర వైద్య సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది.