సౌతాఫ్రికా టీ20 లీగ్ విజేత సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్
తొలిసారిగా జరుగుతున్న సౌతాఫ్రికా 20 లీగ్ ఫైనల్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్లు రెచ్చిపోయారు. లీగ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సఫలీకృతమయ్యారు.
దిశ, వెబ్ డెస్క్: తొలిసారిగా జరుగుతున్న సౌతాఫ్రికా 20 లీగ్ ఫైనల్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్లు రెచ్చిపోయారు. లీగ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సఫలీకృతమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. వాన్ డెర్ మర్వె 4 వికెట్లతో ప్రిటోరియా క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. మగల, బార్ట్ మాన్ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రిటోరియా క్యాపిటల్స్ తరఫున కుశాల్ మెండీస్ (19 బంతుల్లో 21; 1 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రైలీ రోసో (19), జేమ్స్ నీషమ్ (19) మినహా మిగిలిన వారు దారుణంగా విఫలమయ్యారు.
వర్షం కారణంగా ఆదివారానికి వాయిదా పడ్డ ఈ ఫైనల్లో సన్ రైజర్స్ తొలి అర్ధ భాగంలో అదరగొట్టింది. టాస్ నెగ్గిన కెప్టెన్ మార్కరమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక లీగ్ టాపర్ గా ఉన్న ప్రిటోరియా క్యాపిటల్స్ ఫైనల్లో మాత్రం తడబడింది. ముఖ్యంగా బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ స్పిన్నర్లకు దాసోహమయ్యారు. మర్వె బౌలింగ్ లో చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే అతడికి వికెట్లు సమర్పించుకుని పెవిలియన్ కు చేరారు. ఇక అదే సమయంలో మార్కరమ్ కూడా నాలుగు ఓవర్లు వేసి కీలకమైన ఇంగ్రమ్ ను బౌల్డ్ చేశాడు. తన కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి మరోసారి జట్టును ముందుండి నడిపించాడు.
అనంతరం బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఓపెనర్ రోసింగ్టన్ (30 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్) వీరవిహారం చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అదేవిధంగా జోర్డన్ హర్మన్ (17 బంతుల్లో 22; 5 ఫోర్లు, 5 సిక్స్), కెప్టెన్ మార్కరమ్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), ఇక విజయం తథ్యమే అన్న తరుణంలో అనవసర షాట్లకు పోయి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్ అన్రిచ్ నోకియా ఆకట్టుకున్నాడు. చివరి దశలో ఓటమికి చేరువైన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ను ఆల్ రౌండర్ మార్కొ యానసన్ (11 బంతుల్లో 13; 1 ఫోర్లు, 1 సిక్స్) తనదైన బ్యాటింగ్ తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.