Shubman gill : బోటన వేలుకు గాయం.. ఫస్ట్ టెస్ట్‌ నుంచి గిల్ ఔట్?

ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న వేళ టీంఇండియాను వరుస గాయాలు కలవరపెడుతున్నాయి.

Update: 2024-11-16 13:15 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న వేళ టీంఇండియాను వరుస గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కేఎల్ రాహుల్, సర్ఫ్ రాజ్ ఖాన్, విరాట్ కోహ్లికి గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా శనివారం పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరుగుతున్న ఇంట్రా స్క్వాడ్ ట్రైనింగ్ మ్యాచ్‌లో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ బోటనవేలికి గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం ఎడమ చేయి బొటనవేలుకి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే గిల్ కోలుకోవడానికి 14 రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరిగే రెండో టెస్ట్‌కు గిల్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్‌కు గిల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. గిల్ గతేడాది నుంచి మూడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు. జట్టు అవసరాలను బట్టి యశస్వి జైశ్వాల్‌తో ఓపెనింగ్‌కు దిగుతున్నాడు. ఇటీవల ఇండియా ఏ-ఆస్ట్రేలియా సిరీస్‌లో 0,7,17,12 పరుగులు చేసి నిరాశ పర్చిన అభిమన్యు ఈశ్వరన్ భారత్ తరఫున ఓపెనింగ్‌ రోల్‌లో పరిశీలనలో ఉన్నాడు. రోహిత్ శర్మ తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడని ప్రచారం సాగుతుండటంతో భారత జట్టుకు బిగ్ రిలీఫ్ కానుంది. రోహిత్ శర్మ జట్టులో చేరితే మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్ లేదా ధ్రువ్ జురేల్‌ను భారత్ ఆడించనుంది.

Tags:    

Similar News