శుభ్‌మన్ గిల్ డకౌట్‌పై ఫ్యాన్స్ ఫైర్!

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియాలో మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్.. ఔటైన విధానంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Update: 2023-03-19 10:06 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియాలో మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్.. ఔటైన విధానంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. వేసిన తొలి ఓవర్లో మూడో బంతికే గిల్‌ను పెవిలియన్‌కు చేరాడు. మంచి ఫామ్‌లో ఉన్న గిల్.. చాలా లూజ్ షాట్ ఆడి ఔటయ్యాడు. రెండు బంతులకు డాట్ బాల్స్ ఆడాడు గిల్. తర్వాతి బంతి వైడ్ కాగా.. ఆ మరుసటి బంతికే అనవసరంగా షాట్ ఆడబోయి పెవిలియన్‌కు చేరాడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవలగా స్టార్క్ వేసిన బంతిని పుష్ చేసేందుకు గిల్ ప్రయత్నించగా.. గాల్లోకి లేచిన బంతి పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లబుషేన్ వద్దకు ఛెస్ట్ హైట్‌లో దూసుకెళ్లింది.

దాన్ని అతను ఎలాంటి పొరపాటు చెయ్యకుండా చటుక్కున పట్టేశాడు. దీంతో గిల్ నిరాశగా మైదానం వీడాల్సి వచ్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కూడా గిల్ దాదాపు ఇదే మాదిరిగా అవుటయ్యాడు. తనదైన స్టైల్‌లో కట్ షాట్ ఆడే గిల్.. ఇదే షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఔటవుతున్నాడు. తొలి వన్డేలో కూడా ఇలాగే ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తుచేస్తున్న ఫ్యాన్స్.. గిల్‌పై మండిపడుతున్నారు. మొదలి మ్యాచ్ నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని.. శ్రీలంకపై ఆడినట్లు ఆసీస్‌పై ఆడబోతే ఇలాగే ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు. 'మొదటి మ్యాచ్‌లో వేసిన బౌలరే, అదే ఫీల్డర్, అదే బాల్, అదే షాట్, అదే వికెట్' అని విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News