టెన్నిస్ టోర్నీలో అదరగొడుతున్న తెలుగమ్మాయి శ్రీవల్లి

ఐటీఎఫ్ ఉమెన్స్-35 టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక అదరగొడుతున్నది.

Update: 2024-03-15 14:23 GMT

దిశ, స్పోర్ట్స్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతున్న ఐటీఎఫ్ ఉమెన్స్-35 టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక అదరగొడుతున్నది. ఉమెన్స్ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఆమె క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 5వ సీడ్‌కు షాకిచ్చింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీవల్లి 6-0, 6-0 తేడాతో 5వ సీడ్, లిథువేనియా క్రీడాకారిణి జస్టినా మికుల్సైటె‌ను చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీవల్లి దూకుడు ముందు ప్రత్యర్థి ఏమాత్రం నిలువలేకపోయింది. ప్రత్యర్థి ఒక్క గేమ్ కూడా గెలవలేదంటే శ్రీవల్లి ఏ విధంగా ఆధిపత్యం ప్రదర్శించిందో అర్థం చేసుకోవచ్చు. సెమీస్‌లో 7వ సీడ్ పొలిన లాట్కెనెకో‌తో శ్రీవల్లి తలపడనుంది. ఉమెన్స్ డబుల్స్‌లోనూ శ్రీవల్లి జోరు కొనసాగుతున్నది. వైదేహి చౌదరితో కలిసి ఆమె ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో శ్రీవల్లి జోడీ 6-1, 7-6 తేడాతో మరో భారత జంట సహజ-జీల్ దేశాయ్‌పై విజయం సాధించింది. ఫైనల్‌లో 4వ సీడ్ యా హ్సుయాన్ లీ-సోహ్యున్ పార్క్ జోడీతో శ్రీవల్లి జంట తాడోపేడో తేల్చుకోనుంది. 

Tags:    

Similar News