భారత జట్టుకు షాక్.. ఆ పేస్ బౌలర్ లేకుండానే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్

బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ తర్వాత భారత జట్టు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఈ సిరీస్ కీలకంగా మారనుంది.

Update: 2024-10-15 09:25 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ తర్వాత భారత జట్టు న్యూజిలాండ్‌(New Zealand)తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్(World Test Championship) ఫైనల్ రేసులో ఈ సిరీస్ కీలకంగా మారనుంది. రేపటి నుంచి బెంగళూరు(Bangalore) వేదికగా జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma) మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అలాగే త్వరలో ఆడబోయే.. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గురించి కూడా రోహిత్ మాట్లాడారు. ఈ క్రమంలోనే భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) రీ ఎంట్రీపై రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మోకాలి గాయం కారణంగా సర్జరీ చేయించుకొని, ఐపీఎల్, టీ20, ఆసియా కప్ వంటి ప్రతిష్టాత్మక సిరీస్ లకు దూరం అయ్యారు. అయితే ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ అంటే మాత్రం ముందుగా షమీ గుర్తుకొస్తాడు. ఈ క్రమంలోనే షమీ రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందని.. మీడియా ప్రతినిధి అడగ్గా.. రోహిత్ స్పందిస్తూ.." త్వరలో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరంగా ఉంటారు. ఆయన మోకాలీలో వాపు వచ్చింది. ప్రస్తుతం షమీ ఎన్సీఏ వైద్యులు, ఫిజియో తెరఫీల పర్యవేక్షణలో ఉన్నాడు. కాబట్టి అతను కోలుకునేందుకు చాలా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో ఆయనకు రెస్ట్ ఇవ్వడం మంచిదని రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు.


Similar News