Shahid Afridi: 'మరీ ఓవర్‌ అనిపించింది'.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై షాహిద్‌ అఫ్రిది కామెంట్స్

టీమిండియా మహిళల కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై విమర్శలు తగ్గడం లేదు.

Update: 2023-07-26 10:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మహిళల కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై విమర్శలు తగ్గడం లేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అంపైర్‌పై దురుసు ప్రవర్తనతో ఐసీసీ ఆగ్రహానికి గురైన హర్మన్‌ రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఆసియా గేమ్స్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు హర్మన్‌ స్థానంలో స్మృతి మంధాన జట్టను నడిపించే అవకాశముంది. అయితే హర్మన్‌ తీరుపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్‌ విషయంలో హర్మన్‌ చేసింది ఓవర్‌గా అనిపించిందని.. అంత వైల్డ్‌గా రియాక్ట్‌ కావాల్సిన అవసరం లేదని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. కాగా హర్మన్ తీరుపై భారత మాజీలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మదన్ లాల్ లాంటి మాజీ క్రికెటర్ స్పందిస్తూ.. బీసీసీఐ కూడా హర్మన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గత శనివారం మిర్పూర్‌లో భారత్, బంగ్లాదేశ్‌ మహిళల మధ్య మూడో వన్డే జరిగింది. ‘టై’గా ముగిసిన ఈ మ్యాచ్‌లో వేర్వేరు సందర్భాల్లో హర్మన్‌ దురుసుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్మన్‌‌కు రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. దీంతోపాటు ఆమె మ్యాచ్‌ ఫీజులో కూడా 75 శాతం కోత పడింది. ఐసీసీ లెవల్‌–2 నిబంధన ప్రకారం.. నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్‌ హర్మన్‌ కావడం గమనార్హం.


Similar News