డబ్ల్యూపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి ఆ స్టార్ హీరో పర్ఫామెన్స్.. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు

ఐపీఎల్‌ ఓపెనింగ్ సెర్మనీకి ఏమాత్రం తగ్గకుండా డబ్ల్యూపీఎల్ ప్రారంభ వేడుకలకు ఏర్పాట్లు జరిగాయి.

Update: 2024-02-22 13:53 GMT
డబ్ల్యూపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి ఆ స్టార్ హీరో పర్ఫామెన్స్.. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. చెన్నయ్ వేదికగా శుక్రవారం జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు లీగ్ నిర్వాహకులు ఓపెనింగ్ సెర్మనీని ఏర్పాటు చేశారు. ఐపీఎల్‌ ఓపెనింగ్ సెర్మనీకి ఏమాత్రం తగ్గకుండా డబ్ల్యూపీఎల్ ప్రారంభ వేడుకలకు ఏర్పాట్లు జరిగాయి.

ఓపెనింగ్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు 6:30 గంటలకు ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. దాదాపు గంటపాటు ప్రారంభ వేడుకలు జరుగుతాయి. ‘క్రికెట్ కా క్వీన్‌డమ్’ పేరుతో ఈ వేడుకలను నిర్వహించనున్నారుప్రారంభ వేడుకలను మరోసారి స్థాయికి తీసుకెళ్లేలా నిర్వాహకులు బాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దించారు. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సందడి చేయనున్నాడు. కింగ్ ఖాన్ తన ప్రదర్శనతో అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయమే. షారుఖ్ ఖాన్‌తోపాటు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తీక్ ఆర్యన్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే, దేశంలోని పలువురు టాప్ సింగర్స్ కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News