ICC Code of Conduct : ఐపీఎల్‌-2025‌లో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు

ఐపీఎల్-2025 సీజన్‌ నుంచి ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కానుంది.

Update: 2025-01-12 15:03 GMT
ICC Code of Conduct : ఐపీఎల్‌-2025‌లో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2025 సీజన్‌ నుంచి ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కానుంది. ఈ మేరకు ఆదివారం బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. మార్చి 21న ప్రారంభం అయ్యే ఐపీఎల్ సీజన్‌లో నిబంధనలను అతిక్రమించిన ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాల మేరకు చర్యలు తీసుకోనున్నారు. ‘ఈ ఐపీఎల్ సీజన్ నుంచి ఐసీసీ నియమాలను ఉల్లంఘించిన ఆటగాళ్లకు జరిమానాలు విధిస్తాం. లెవల్ 1, 2 మరియు 3ను అతిక్రమించిన వారికి పెనాల్టీలు వేస్తాం. ఇప్పటి వరకు ఐపీఎల్ తన సొంత కోడ్ ఆఫ్ కండక్ట్‌తో కొనసాగుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌లు ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం కొనసాగుతున్నాయి.’ అని ఐసీసీ జీసీ మెంబర్ ఒకరు పీటీఐకి తెలిపారు. మరో వైపు మహిళల ప్రీమియర్ లీగ్ దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. లక్నో, ముంబై, బరోడా, బెంగళూరులను వేదికలుగా ఎంపిక చేశారు.

Tags:    

Similar News