తుపాకీతో కాల్చుకుని అర్ధరాత్రి సచిన్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య.. కారణం ఇదే..!

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్ ప్రకాశ్ కాప్డే సర్వీస్

Update: 2024-05-15 11:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్ ప్రకాశ్ కాప్డే సర్వీస్ గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం 2గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. వీవీఐపీ సెక్యూరిటీ సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడటంతో రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ప్రకాశ్ కాప్డే అనే జవాన్ వీవీఐపీ సెక్యూరిటీలో భాగంగా మాజీ క్రికెటర్ సచిన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఉద్యోగానికి కొన్ని రోజులు సెలవు పెట్టి కాప్డే సొంత గ్రామానికి వెళ్లారు.

ప్రస్తుతం ఇంటి వద్దే ఉన్న అతడు.. ఏమైందో తెలియదు కానీ బుధవారం తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. కాప్డే సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యా్ప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. వీవీఐపీ సెక్యూరిటీ సిబ్బంది కావడంతో కేసు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. కాప్డే ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే రీజనా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Similar News