క్రికెట్ గాడ్.. సచిన్ టెండూల్కర్‌కు దక్కిన అరుదైన గౌవరం

ఇండియన్ క్రికెట్ గాడ్ గా పేరు సంపాదించుకున్న భారత సీనియర్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)కు మరో అరుదైన గౌరవం దక్కింది.

Update: 2024-12-27 10:18 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ క్రికెట్ గాడ్ గా పేరు సంపాదించుకున్న భారత సీనియర్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ (Melbourne Cricket Club) సభ్యుడిగా సచిన్ కు చోటు దక్కింది. కాగా దీనికి సంబంధించిన వివరాలను MCC ఈ రోజు తమ ట్విట్టర్ ద్వారా క్రికెట్ అభిమానులతో పంచుకుంది. అందులో.. MCC సభ్యుడిగా సచిన్ ను ఎన్నుకున్న మా నిర్ణయాన్ని ఆయన స్వాగతించారని రాసుకొచ్చింది. అయితే ప్రపంచ క్రికెట్ కు ఆయన చేసి అత్యుత్తమ సేవలు అందించిన సచిన్ ఇప్పుడు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ లో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందని MCC ట్వీట్ లో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే సచిన్ MCG లో మొత్తం ఐదు టెస్టులు ఆడగా.. ఆయన 58.69 స్ట్రైక్ రేటుతో ఏకంగా 449 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికి సచిన్ లాంటి సీనియర్ ప్లేయర్ ను MCC సభ్యుడిగా చేర్చుకున్నందుకు.. ఆయన అభిమానులతో పాటు భారత క్రికెట్ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Similar News