ఐసీసీ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మకు రెండోస్థానం

టీం ఇండియా బ్యాటర్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచాడు.

Update: 2024-08-14 10:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : టీం ఇండియా బ్యాటర్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ రాణించడంతో మూడో స్థానం నుండి రెండో స్థానానికి ఎగబాకాడు. కాగా రెండో స్థానంలో ఉన్న శుభమన్ గిల్ శ్రీలంక సిరీస్ లో అంతగా ఆడకపోవడంతో ఒక స్థానం దిగిపోయి రెండో స్థానం నుండి మూడో స్థానానికి చేరాడు. ఇక పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. నాలుగవ స్థానంలో విరాట కోహ్లీ ఉన్నాడు. ఇక బౌలింగ్ విషయంలో భారత్ నుండి కులదీప్ యాదవ్ నాలుగవ స్థానంలో ఉన్నాడు.సౌత్ ఆఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హెజిల్ వుడ్ రెండో స్థానంలో ఉన్నాడు. బుమ్రా ఎనిమిదవ స్థానంలో ఉండగా.. మహ్మద్ సిరాజ్ పదవ స్థానానికి పడిపోయాడు.


Similar News