BREAKING: భారత క్రికెట్‌లో మరో కీలక పరిణామం.. టీ-20లకు మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

టీమిండియా టీ-20 వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు వరుస షాకులు తగులుతున్నాయి. భారత్ టీ-20 వరల్డ్ కప్

Update: 2024-06-30 11:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా టీ-20 వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు వరుస షాకులు తగులుతున్నాయి. భారత్ టీ-20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం.. టీమిండియా స్టార్ట్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ-20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కప్ గెలిచిన హ్యాపీనెస్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు ఈ వార్త తీవ్ర నిరాశను మిగిల్చింది. దీని నుండి అభిమానులు తేరుకోకముందే భారత క్రికెట్ ప్రియులు మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం టీ-20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జడేజా రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు.

ఇప్పటి వరకు అత్యుత్తమమైన ఆటను దేశానికి అందించానని, టీ-20 వరల్డ్ కప్ గెలవడంతో తన కల నేరవేరిందని సందర్భంగా జడేజా పేర్కొన్నాడు. టీ-20 ఫార్మాట్‌కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించానని.. భారత్ తరఫున వన్డే, టెస్టులు ఆడుతానని ఈ సందర్భంగా జడ్డూ క్లారిటీ ఇచ్చాడు. కాగా, ఇప్పటి వరకు భారత్ తరుఫున 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 515 పరుగులు చేసి.. 54 వికెట్లు తీశాడు. తన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఎన్నో మ్యాచుల్లో జడేజా టీమిండియాకు అద్భుత విజయాలను అందించాడు. జడేజా రిటైర్మెంట్‌తో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు. ఇకపై టీ20ల్లో జడ్డూ లేని మ్యాచులు చూడాలని బాధను వ్యక్తం చేస్తున్నారు.


Similar News