Virat Kohli : ఆ ఒక్క పని చేస్తే అందరి నోళ్లు మూతపడుతాయి: రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ లేమి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

Update: 2022-08-24 06:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ లేమి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రన్ మెషిన్‌గా పేరుగాంచిన విరాట్.. ప్రస్తుతం పరుగులు చేయడానికి నానాతంటాలు పడుతున్నాడు. క్రీజ్‌లో కుదురుకుంటే సునాయసంగా సెంచరీలు బాదే కోహ్లీ.. సెంచరీ చేయక దాదాపుగా మూడు సంవత్సరాలు కావస్తోందంటే అర్థం చేసుకోవచ్చు అతడి ఆట ఏ విధంగా సాగుతుందో అని.. ఈ వార్తను సగటు విరాట్ అభిమాని జీర్ణించుకోలేపోతున్నారు. ఒకప్పడు కోహ్లీని ఆకాశానికెత్తిన వారే.. ఇప్పడు అతడిని జట్టులో నుండి తొలగించాలంటూ విమర్శలు చేస్తున్నారు. కొందరు కోహ్లీను విమర్శిస్తుండగా.. మరికొందరు అతడికి అండగా నిలుస్తున్నారు.

తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. కోహ్లీపై విమర్శలు చేసేవారిపై రవిశాస్త్రి కీలక వ్యా్ఖ్యలు చేశాడు. ఈ నెల 27న ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ దాయాది పాకిస్థాన్ జట్టుపై 50 పరుగులు చేస్తే అందరి నోళ్లు మూతపడుతాయంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. విరాట్ గొప్ప ఆటగాడని.. అతడు మళ్లీ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమి లేదని అన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమని.. వాటి నుండి బయటపడటానికి కొంత సమయం పడుతోందని శాస్త్రి పేర్కొన్నాడు.

Tags:    

Similar News