అతడి ఫామే సిరీస్‌ను డిసైడ్ చేస్తుంది : Ravi Shastri
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ కీలకం కానున్నాడని స్పష్టం చేశారు. అతడు రాణిస్తే సిరీస్ డిసైడ్ అవుతుందని తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియా తో టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఇరుజట్లు తొలి టెస్టు వేదిక నాగ్‌పూర్‌కు చేరుకుని ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. బౌలర్లకు అనుకూలించే స్వదేశీ పిచ్‌లపై స్పిన్‌పై దృష్టి పెట్టింది. దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియాకు కీలకమని పేర్కొన్నాడు. ''అశ్విన్ మెరుగైన ప్రదర్శన చేస్తే సిరీస్ భారత్ తప్పకుండా గెలుస్తుంది. అశ్విన్ ఫామే సిరీస్‌ను డిసైడ్ చేస్తుంది. అతడు టీమిండియాకు ఓ ప్యాకేజ్ లాంటి వాడు. కీలక పరుగులు కూడా చేయగలడు'' అని రవిశాస్త్రీ స్పష్టం చేశారు.