Rafael Nadal : రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన నాదల్

కొంతకాలంగా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ గాయాల కారణంగా తన స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు.

Update: 2024-07-21 16:28 GMT

దిశ, స్పోర్ట్స్ : కొంతకాలంగా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ గాయాల కారణంగా తన స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. దీంతో పారిస్ ఒలింపిక్స్ తర్వాత అతను టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా నాదల్ తన రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చాడు. వచ్చే ఏడాది తాను నార్డియా ఓపెన్‌లో పాల్గొనకపోవచ్చని వ్యాఖ్యానించాడు.

స్వీడెన్‌లో జరిగిన నార్డెన్ ఓపెన్‌ టోర్నీ‌లో రాణించిన నాదల్ రెండేళ్ల తర్వాత ఓ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాడు. అయితే, అతనికి నిరాశ తప్పలేదు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో నాదల్‌ను 3-6, 2-6 తేడాతో పోర్చుగీస్ ప్లేయర్ నునో బోర్జెస్ ఓడించి టైటిల్ ఎగరేసుకపోయాడు.

ఫైనల్ అనంతరం నాదల్ మాట్లాడుతూ..‘కొంతకాలంగా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నా. ప్రతి సందర్భంలోనూ నా టీమ్, నా కుటుంబసభ్యులు నాతోనే ఉన్నారు. కాబట్టి, వారికి కృతజ్ఞలు చెప్పడం తక్కువే అవుతుంది. ఈ టోర్నీలో ఆడటం ఆనందంగా ఉంది. వారం మొత్తం నాకు మద్దతు ఇచ్చారు. కోర్టులో నాకు ప్రత్యేక అనుభూతిని, కఠిన పరిస్థితుల్లో శక్తిని ఇచ్చారు. ఇక్కడ మళ్లీ ఆడతాననో లేదో తెలియదు. బహుశా ఆడకపోవచ్చు. కానీ, తిరిగి ఇక్కడ ఆడటాన్ని సంతోషిస్తా.’ అని చెప్పుకొచ్చాడు. 


Similar News