PV Sindhu: భర్తతో కలిసి పి.వి సింధు అదిరిపోయే ఫొటో షూట్ వైరల్
ఇటీవల ఇండియన్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి. వి సింధు(Indian famous badminton player P. V Sindhu) వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఇండియన్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి. వి సింధు(Indian famous badminton player P. V Sindhu) వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఈ జంట వివాహం రాజస్థాన్(Rajasthan)లోని ఉదయ్‌పూర్(Udaipur)లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి 11. 20 నిమిషాలకు సింధు మెడలో వెంకట దత్త సాయి(Venkata Datta Sai) మూడుముళ్లు వేశారు. తెలుగు సంప్రదాయ పద్ధతిలో సింధు, దత్త సాయి వివాహం చేసుకున్నారు. ఈ జంట పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు సహా 140 మంది వరకు అతిథులు హాజరైనట్లు సమాచారం. రాజస్థాన్‌లో పి. వి సింధు పెళ్లి జరగ్గా.. రీసెంట్ గా హైదరాబాదులో అంగరంగ వైభవంగా చేసుకున్నారు. వీరి రిసెప్షన్ కు పలువురు సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు. ఇకపోతే ఈ నూతన దంపతులు పెళ్లి అనంతరం ఓ స్పెషల్ ప్లేస్‌కెళ్లి ఆకట్టుకునే ఫొటో షూట్ చేశారు. లైట్ బ్లూ కలర్‌లో పి. వి సింధు అండ్ వెంకట దత్త సాయి స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.