కోహ్లీ వంద కోట్ల డీల్ రద్దు.. ప్యూమా స్పందన ఇదే..!

విరాట్ కోహ్లీతో అనుబంధం ముగిసిపోతుందన్న వార్తలను ఖండించింది స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్యూమా. భారత స్టార్ బ్యాటర్ కోహ్లీ.. ప్యూమాతో తెగదెంపులు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Update: 2024-02-07 18:50 GMT

దిశ, స్పోర్ట్స్: విరాట్ కోహ్లీతో అనుబంధం ముగిసిపోతుందన్న వార్తలను ఖండించింది స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్యూమా. భారత స్టార్ బ్యాటర్ కోహ్లీ.. ప్యూమాతో తెగదెంపులు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎనిమిదేళ్ల ఒప్పందాన్ని మధ్యలోనే ముగించాడన్న కనథనాలపై స్పందిచింది ప్యూమా. కోహ్లీతో తమ అనుబంధం కొనసాగుతోందని తెలిపింది

2017లో కోహ్లీ- ప్యూమా మధ్య భాగస్వామ్యం ఏర్పడింది. దీనివిలువ వందకోట్లు. భారతీయ క్రీడా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది ఈ ఒప్పందం. ఒకే బ్రాండ్‌తో ఇంత ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా కోహ్లీ నిలిచాడు. ఈ రన్ మెషీన్ ప్యూమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమయంలో భారత్ లో ఆ కంపెనీ గణనీయమైన వృద్ధి సాధించింది. అథ్లెయిజర్ మార్కెట్ లో ప్యూమాకు భారీగా డిమాండ్ పెరిగింది.

ప్యూమా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగూలీ స్థాపించిన అజిలిటాస్ స్పోర్ట్స్ కంపెనీతో కోహ్లీ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే ప్యూమాను వీడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, కోహ్లితో భాగస్వామ్యం కొనసాగుతుందని పేర్కొంది ప్యూమా. ఫేక్ న్యూస్ పై స్పందిస్తూ.. కోహ్లీపై తమ బంధం చాలా కాలంగా ఉందని.. అది కొనసాగుతోందని స్పష్టం చేశారు ప్యూమా మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ బాలగోపాలన్.


Similar News