Paris Olympics : మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది.. భారత అథ్లెట్లపై ప్రధాని మోడీ ప్రశంసలు

పారిస్ వేదికగా జరిగిన 33వ సమ్మర్ ఒలింపిక్స్ ఆదివారం ముగిశాయి. ఈ విశ్వక్రీడల్లో భారత్ ఆరు పతకాలు సాధించింది.

Update: 2024-08-12 13:32 GMT
Paris Olympics : మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది.. భారత అథ్లెట్లపై ప్రధాని మోడీ ప్రశంసలు
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : పారిస్ వేదికగా జరిగిన 33వ సమ్మర్ ఒలింపిక్స్ ఆదివారం ముగిశాయి. ఈ విశ్వక్రీడల్లో భారత్ ఆరు పతకాలు సాధించింది. పారిస్ ఒలింపిక్స్ ముగింపు సందర్భంగా భారత అథ్లెట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ అత్యుత్తమ ప్రదర్శన చేశారని ప్రశంసించాడు. ‘పారిస్ ఒలింపిక్స్ ముగిశాయి. భారత బృందం కృషిని అభినందిస్తున్నా. అథ్లెట్లందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన చేశారు. వారి ప్రదర్శన పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. మన క్రీడా హీరోలు భవిష్యత్తు టోర్నీల్లో సత్తాచాటాలి. వారికి నా శుభాక్షాంక్షలు.’ అని రాసుకొచ్చారు. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరపున 117 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సారి స్వర్ణం దక్కకపోవడం పెద్ద లోటే. ఆరు పతకాల్లో ఒక్క రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. 

Tags:    

Similar News