PKL 2024 : రెచ్చిపోయిన పవన్ సెహ్రావత్.. తిరిగి గెలుపు బాట పట్టిన తెలుగు టైటాన్స్

Update: 2024-12-14 19:12 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ పుంజుకుంది. వరుసగా రెండు పరాజయాల తర్వాత తిరిగి గెలుపు బాట పట్టింది. పుణెలో శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 32-36తేడాతో పోరాడి గెలిచింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్(12 పాయింట్లు), ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్(8 పాయింట్ల) సత్తాచాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్‌లో టైటాన్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓ సారి ఆలౌటైంది. ఆరంభంలో గుజరాత్ ఆధిపత్యమే కొనసాగడంతో ఫస్టాఫ్‌లో 11-18తో వెనుకబడింది. కానీ, సెకండాఫ‌లో టైటాన్స్ బలంగా పుంజుకుంది. గుజరాత్‌ను నిలువరించి వరుసగా పాయింట్లు సాధించింది. ఈ క్రమంలోనే ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసింది. సెకండాఫ్‌లో సత్తాచాటడంతో టైటాన్స్ విజయతీరాలకు చేరింది. గుజరాత్ తరపున రైడర్లు రాకేశ్(10 పాయింట్లు), కెప్టెన్ గుమాన్ సింగ్(9 పాయింట్లు)పోరాటం వృథా అయ్యింది. తాజా విజయంతో తెలుగు టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో 5వ స్థానానికి చేరుకుంది. దీంతో ప్లేఆఫ్స్ దిశగా ఆశలను మెరుగుపర్చుకున్నది.


Tags:    

Similar News