Abdullah Shafique: రికార్డు సృష్టించిన పాక్ ఓపెనర్.. లంక గడ్డపై డబుల్‌ సెంచరీ బాదిన తొలి ఓపెనర్‌గా..

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్లులో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ డబుల్‌ సెంచరీతో మెరిశాడు.

Update: 2023-07-26 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్లులో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ డబుల్‌ సెంచరీతో మెరిశాడు. 322 బంతుల్లో షఫీక్‌ 19 ఫోర్లు, 4 సిక్సర్లతో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా టెస్టు క్రికెట్‌లో అబ్దుల్లా షఫీక్‌కు ఇదే తొలి డబుల్‌ సెంచరీ కావడం విశేషం. 23 ఏళ్ల వయసున్న అబ్దుల్లా షఫీక్‌ పాక్‌ తరఫున డబుల్‌ సెంచరీ చేసిన మూడో యంగెస్ట్‌ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

ఇంతకముందు జావెద్‌ మియాందాద్‌, హనీఫ్‌ మొహమ్మద్‌లు ఈ ఘనత సాధించారు. ఇక లంక గడ్డపై డబుల్‌ సెంచరీ బాదిన తొలి పాక్‌ ఓపెనర్‌గానూ అబ్దుల్లా షఫీక్‌ చరిత్రకెక్కాడు. ఇక రెండో టెస్టులో పాకిస్తాన్‌ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన పాక్‌ సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రస్తుతం పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 458 పరుగులు చేసింది.


Similar News