పోలిష్ ఓపెన్ టైటిల్ అనుపమదే
ఓర్లెన్ పోలిష్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి అనుపమ ఉపాధ్యాయ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
దిశ, స్పోర్ట్స్ : పొలాండ్‌లో జరిగిన ఓర్లెన్ పోలిష్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి అనుపమ ఉపాధ్యాయ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్‌లో అనుపమ 21-15, 11-21, 21-10 తేడాతో సహచర క్రీడాకారిణి తన్య హేమంత్‌పై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. పోలిష్ ఓపెన్ టైటిల్ గెలవడం అనుపమకు ఇది రెండోసారి. 2022లో తొలిసారి ఆమె టోర్నీ విజేతగా నిలిచింది. అలాగే, భారత డబుల్స్ స్టార్ ప్లేయర్లు అర్జున్, ధ్రువ్ కపిల పురుషుల డబుల్స్ టైటిల్‌ను దక్కించుకున్నారు. ఫైనల్‌లో అర్జున్-ధ్రువ్ జోడీ 15-21, 23-21, 21-19 తేడాతో డెన్మార్క్‌కు చెందిన విలియం క్రైగర్-క్రిస్టియన్ జోడీపై అద్భుత విజయం సాధించింది.