Olympics-2024: షట్లర్ లక్ష్యసేన్‌కు చుక్కెదురు.. గెలుపును రద్దు చేసిన నిర్వాహకులు
ఒలింపిక్స్‌లో భారత్ షట్లర్ లక్ష్యసేన్‌కు చుక్కెదురైంది. బ్యాడ్మింటన్ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో అతడు తలపడిన ప్రత్యర్థి అర్థాంతరంగా మ్యాచ్ నుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఒలింపిక్స్‌లో భారత్ షట్లర్ లక్ష్యసేన్‌కు చుక్కెదురైంది. బ్యాడ్మింటన్ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో అతడు తలపడిన ప్రత్యర్థి అర్థాంతరంగా మ్యాచ్ నుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఒలింపిక్స్ నిర్వహకులు లక్ష్యసేన్ విజయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం గ్వాటమాలాకు చెందిన కెవిన్ కోర్డన్‌తో లక్ష్యసేన్ తలపడ్డాడు. 21-8, 22-20 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. తొలి సెట్‌లో ఏకపక్షంగా సాగినా.. రెండో సెట్ హోరాహోరీగా కొనసాగింది. ఈ క్రమంలోనే లక్ష్యసేన్ స్వల్ప తేడాతో విజయం సాధించాడు. మ్యాచ్ అనంతరం చేతి గాయం కారణంగా కెవన్ కోర్డన్ ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో, గ్రూప్ లీగ్‌లో ఇండోనేషియా, బెల్జియం క్రీడాకారులతో ఆ తరువాతి మ్యాచ్‌లు పూర్తిగా రద్దు అయ్యాయి. దీంతో లక్ష్యసేన్ తొలి గెలుపును కూడా నిర్వాహకులు తీసివేశాడు.