Nitish Reddy : పాండ్యా కన్నా నితీశ్ రెడ్డి బెటర్.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

టెస్ట్‌ల్లో హార్దిక్ పాండ్యా కన్నా నితీశ్ కుమార్ రెడ్డి బెటర్ అని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు.

Update: 2024-12-31 09:51 GMT

దిశ, స్పోర్ట్స్ : టెస్ట్‌ల్లో హార్దిక్ పాండ్యా కన్నా నితీశ్ కుమార్ రెడ్డి బెటర్ అని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని స్పోర్ట్ స్టార్‌కు రాసిన ఓ వ్యాసంలో వెల్లడించాడు. ‘మెల్‌బోర్న్ టెస్ట్ భారత క్రికెట్‌కు అద్భుతమైన యువ ఆటగాడిని అందించింది. ఐపీఎల్‌లో హైదరాబాద్ తరఫున చేసిన ప్రదర్శనతో భారత ఫ్యాన్స్‌ను నితీశ్ ఆకట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ లెవల్‌లో అతను రాణించలేదు. టెస్ట్‌ల్లో అతడిని ఎంపిక చేసిన అజిత్ అగార్కర్, సెలక్టర్ల బృందానికి ఈ క్రెడిట్ దక్కుతుంది. పెర్త్‌లో ఆడిన అరంగేట్ర టెస్ట్‌లో నితీశ్ పరిస్థితులను అర్థం చేసుకుని బ్యాటింగ్ చేశాడు. తర్వాత ఆడిన టెస్ట్‌ల్లో సైతం అతని ఆటతీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేశాడు. హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు మంచి ఆల్ రౌండర్ కోసం చూస్తోంది. నితీశ్ రెడ్డి బౌలింగ్‌ ప్రొగ్రెస్‌లో ఉంది. కానీ బ్యాట్స్‌మెన్‌గా నితీశ్ పాండ్యా కంటే చాలా బెటర్’ అని గవాస్కర్ అన్నాడు. 

Tags:    

Similar News