Neeraj Chopra:బ్రస్సెల్స్‌ డైమండ్ లీగ్ ఫైనల్..సెంటీమీటర్ తేడాతో ట్రోఫీని కోల్పోయిన నీరజ్ చోప్రా

భారత(India) స్టార్ జావెలిన్ త్రో(Javelin throw) ప్లేయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరోసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Update: 2024-09-14 21:35 GMT

దిశ, వెబ్‌డెస్క్:భారత(India) స్టార్ జావెలిన్ త్రో(Javelin throw) ప్లేయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరోసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.గత ఆగష్టు నెలలో జరిగిన లుసానే డైమండ్ లీగ్(Lausanne Diamond League)లో నీరజ్ రెండవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే..శనివారం బ్రస్సెల్స్‌(Brussels) వేదికగా కింగ్ బౌడౌయిన్ స్టేడియం(King Baudouin Stadium)లో జరిగిన డైమండ్ లీగ్(Diamond League) ఫైనల్ లో కేవలం సెంటీమీటర్ తేడాతో మరోసారి ట్రోఫీ గెలిచే అవకాశం కోల్పోయాడు.ఫైనల్‌లో మొత్తంగా ఆరు సార్లు బల్లెం విసిరిన నీరజ్‌ చోప్రా.. మూడో ప్రయత్నంలో అత్యధికంగా 87.86 మీటర్ల దూరం విసిరి రన్నరప్ గా నిలిచారు.గ్రెనడా(Granadaకు) చెందిన ఆండర్సన్ పీటర్స్ (Anderson Peters) జావెలిన్ ను 87.87 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలవగా, జర్మనీ(Germany)కి చెందిన జూలియన్ వెబర్(Julian Weber) 85.97 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు.మొదటి స్థానంలో నిలిచిన పీటర్స్‌కు 30 వేల డాలర్లు ప్రైజ్ మనీ లభించడంతో పాటు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ కు అర్హత సాధించాడు.రెండో స్థానంతో సరిపెట్టుకున్ననీరాజ్ చోప్రా 12 వేల డాలర్ల నగదు బహుమతి గెలుచుకున్నాడు.కాగా నీరజ్ గత కొన్ని రోజులుగా గజ్జల్లోని కండ‌రాల స‌మ‌స్య‌తో బాధపడుతున్నాడు. దాంతో అత‌డి స‌న్న‌ద్ధ‌త కూడా స‌రిగ్గా జ‌ర‌గ‌లేదు.అయినా స‌రే బ్రస్సెల్స్‌ డైమండ్ లో అద‌ర‌గొట్టాడు.అయితే ఈ సీజ‌న్‌లో బ్ర‌స్సెల్స్ లో జ‌రుగ‌బోయే డైమండ్ లీగ్ ఫైన‌ల్ చివ‌రిది కావొచ్చని చోప్రా ఇదివరకే వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.దీంతో నీరజ్ కొన్ని నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు.   


Similar News