Navdeep Singh: నీ వల్ల ఏదీ సాధ్యం కాదు..చనిపోమన్నారు:పారాలింపిక్స్‌ గోల్డ్ మెడలిస్ట్ నవ్‌దీప్‌ సింగ్‌

పారిస్(Paris) వేదికగా ఇటీవల జరిగిన పారాలింపిక్స్‌లో(Paralympics 2024) భారత (India) జావెలిన్‌ త్రో(Javelin Throw) ప్లేయర్ నవ్‌దీప్‌ సింగ్‌(Navdeep Singh) 'ఎఫ్‌41' ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.

Update: 2024-09-15 23:10 GMT

దిశ, వెబ్‌డెస్క్:పారిస్(Paris) వేదికగా ఇటీవల జరిగిన పారాలింపిక్స్‌లో(Paralympics 2024) భారత (India) జావెలిన్‌ త్రో(Javelin Throw) ప్లేయర్ నవ్‌దీప్‌ సింగ్‌(Navdeep Singh) 'ఎఫ్‌41' ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవ్‌దీప్‌ తాను ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పాడు. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడూతూ..'మరుగుజ్జుగా పుట్టిన నన్ను, నువ్వేమీ చేయలేవు. నీ వల్ల ఏదీ సాధ్యం కాదని చాలా మంది అవమానించారు. నీకు ఇలాంటి జీవితం ఎందుకు..?ఆత్మహత్య చేసుకోవడమే మంచిదంటూ మరికొందరు హేళన చేశారని, వారి నుంచే నేను ప్రేరణ పొందా' అని తెలిపాడు. నేను క్రీడా ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు నా తండ్రి ఎంతో సహకరించారని,ఎల్లప్పుడూ నా వెంటే ఉన్నారు'' అంటూ నవదీప్‌ తెలిపారు.

కాగా ఇటీవల జరిగిన పారాలింపిక్స్‌ క్రీడలలో నవ్‌దీప్‌కు అనూహ్యంగా స్వర్ణ పతకం గెల్చుకున్నాడు.ఎఫ్‌41 ఈవెంట్‌లో 47.32 మీటర్ల మేర బల్లెం విసిరి మొదట రజతం గెల్చుకున్నాడు.ఇరాన్(Iran) దేశానికి చెందిన క్రీడాకారుడు బీట్ సదేగ్(Beit Sadegh) 47.64 మీటర్లు విసిరి స్వర్ణం స్వర్ణం సాధించిగా నిబంధనలు అతిక్రమించిన కారణంగా పారాలింపిక్స్‌ నిర్వాహకులు అతన్ని అనర్హుడిగా ప్రకటించారు.దీంతో రజతం గెల్చుకున్న నవ్‌దీప్‌కు స్వర్ణ పతకం దక్కింది.స్వర్ణం సాధించి ప్రపంచ వేదికపై దేశ కీర్తిని మరింత పెంచాడు.


Similar News