మెల్బోర్న్ : రిటైర్మెంట్ ప్రకటించే వరకు వీలైనన్నీ టోర్నమెంట్స్ గెలవాలని, ప్రస్తుతం అదే తన ముందున్న గోల్ అని భారత్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా శుక్రవారం ప్రకటించారు. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ ఓడిపోయాక 2022 తనకు చివరిదని బుధవారం సానియా మీర్జా చెప్పిన విషయం తెలిసిందే. సానియా తన కెరీర్లో ఆరుసార్లు గ్రాండ్‌స్లమ్ టైటిల్స్ సాధించింది. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో జరిగే US ఓపెన్ తర్వాత ఆమె తన ఆటకు విరామం పలకాలని చూస్తున్నట్టు చెప్పింది.
35 ఏళ్ల సానియా మీర్జా ఫిట్నెస్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని, శరీరం కూడా గేమ్‌కు సహకరించడం లేదని పేర్కొంది. అంతేకాకుండా తన మూడేళ్ల కుమారుడి తో జర్నీ లు చేయడం తన వల్ల కావడం లేదని.. రిటైర్మెంట్ గురించి తన నిర్ణయం ప్రకటించాక చాలా మంది భావోద్వేగానికి గురవ్వడమే కాకుండా తనను కూడా అయ్యేలా చేశారని.. వాస్తవానికి మిమ్మల్ని బాధ పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.