రూ.15 కోట్లు మోసపోయిన ధోనీ.. ఎలానో తెలుసా?

Update: 2024-01-05 14:29 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) సారథి ఎం.ఎస్ ధోనీ కోర్టును ఆశ్రయించాడు. తనతో చేసుకున్న ఒప్పందాన్ని ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌ ఉల్లంఘించిందని, ఫలితంగా తాను రూ. 15 కోట్లు మోసపోయానని ఆరోపిస్తూ రాంచీ కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాష్‌‌లపై క్రిమినల్ కేసు పెట్టాడు. ధోనీ ఫిర్యాదు ప్రకారం.. క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తామని 2017లో ధోనీతో ఆర్కా స్పోర్ట్స్ ఒప్పందం చేసుకుంది. అయితే, ఆర్కా స్పోర్ట్స్ ఒప్పంద షరతులను పాటించలేదు. ఫ్రాంచైజీ రుసుము చెల్లించి, లాభాలను పంచుకోవాల్సి ఉండగా అలా జరగలేదు. ఈ విషయంపై పలు మార్లు నోటీసులు పంపించినా ఆర్కా స్పోర్ట్స్ స్పందించలేదు. దీంతో 2021లో ఆర్కా స్పోర్ట్స్ సంస్థకు మంజూరు చేసిన అధికారిక లేఖను ధోనీ రద్దు చేశాడు. ఆర్కా స్పోర్ట్స్ వల్ల తాము మోసపోయామని, దాదాపు రూ.15 కోట్లు నష్టం కలిగిందని ధోనీ తరఫు న్యాయవాది దయానంద్ సింగ్ పేర్కొన్నాడు.


Tags:    

Similar News