భార్యకు నెలకు రూ. 50 వేలు భరణం.. మహ్మద్ షమీకి కోర్టు ఆదేశం

విడాకులిచ్చిన భార్య హసిన్ జహన్‌కు నెలకు రూ. 50 వేల జరిమానా చెల్లించాలని టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది.

Update: 2023-01-24 16:53 GMT

న్యూఢిల్లీ: విడాకులిచ్చిన భార్య హసిన్ జహన్‌కు నెలకు రూ. 50 వేల జరిమానా చెల్లించాలని టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. నాలుగేళ్ల క్రితం షమీపై జహన్ అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు నిర్దేశించిన భరణంపై జహన్ అసంతృప్తిగా ఉన్నారు. ఆమె నెలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని కోరుకుంటోంది. నెలకు రూ. 10 లక్షల భరణం ఇప్పించాలని 2018లో జహన్ లీగల్ కేసు పెట్టారు. ఇందులో రూ. 7 లక్షలు వ్యక్తిగత అవసరాలకు, రూ. 3 లక్షలు కూతురును చూసుకునేందుకని జహన్ తన కేసులో పేర్కొన్నారు.

కోర్టు తీర్పుపై అసంతృప్తితో ఉన్న జహన్ మరింత ఎక్కువ భరణం కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముంది. వ్యభిచారం, గృహ హింస ఆరోపణలతో జహన్ జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడంతో ఈ గొడవ ప్రారంభమైంది. దీంతో షమీపై గృహ హింస, హత్యాయత్నం వంటి నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని తన పుట్టింటికి వెళ్లినపుడల్లా భర్త షమీ, ఆయన కుటుంబ సభ్యులు హింసించేవారని జహన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


Similar News