ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నా.. హాకీ యువ గోల్ కీపర్

భారత హాకీ జట్టు యువ గోల్ కీపర్‌ పవన్ మాలిక్‌కు మార్చిలో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో సీనియర్ టీమ్‌లో చోటు దక్కింది.

Update: 2023-05-01 16:11 GMT

న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు యువ గోల్ కీపర్‌ పవన్ మాలిక్‌కు మార్చిలో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో సీనియర్ టీమ్‌లో చోటు దక్కింది. ప్రపంచ ఉత్తమ జట్లతో పోటీ పడేటప్పుడు ఒత్తిడికి లోనయ్యానన్నాడు. కానీ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో లెజెండరీ పీఆర్ శ్రీజేష్ నుంచి నేర్చుకున్నానని అతను చెప్పాడు. ఇటీవల రూర్కెలాలో జరిగిన ప్రొ లీగ్ గేమ్స్‌లో 21 ఏళ్ల పవన్ తన ప్రతిభతో అందిరినీ ఆకట్టుకున్నాడు. క్రిషన్ పాఠక్ తన పెళ్లి కారణంగా వ్యక్తిగత సెలవుపై వెళ్లాడు. దీంతో పవన్‌కు సీనియర్ జట్టులో చోటు దక్కింది. మార్చిలో రూర్కెలాలో వరల్డ్ చాంపియన్ జర్మనీ, ఆస్ట్రేలియా జట్లతో భారత్ ఆడింది.

‘జర్మనీ, ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లతో ఆడినప్పుడు ఒత్తిడికి గురయ్యాను. నేను జూనియర్ జట్టులో ఆడిన విధానానికి.. ఇక్కడ పెద్ద జట్లు ఆడే ఆ స్పీడ్, అటాక్‌కు చాలా తేడా ఉంది. కానీ సీనియర్స్ అందరూ నాకు అండగా నిలిచారు. వారి అనుభవాలను పంచుకున్నారు. రెండు దశాబ్దాల అనుభవమున్న లెజెండ్ పీఆర్ శ్రీజేష్‌ నుంచి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను’ అని పవన్ చెప్పినట్టు హాకీ ఇండియా తెలిపింది.

Tags:    

Similar News