సరికొత్త రికార్డ్ సృష్టించనున్న Virat Kohli. చేయాల్సిందల్లా అదొక్కటే..
దిశ, వెబ్‌డెస్క్: విరాట్ కోహ్లీ గత 3 ఏళ్లుగా ఫార్మ్ కోల్పోయి పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్ర నిరాశ పరుస్తున్నాడు..
దిశ, వెబ్‌డెస్క్: విరాట్ కోహ్లీ గత 3 ఏళ్లుగా ఫార్మ్ కోల్పోయి పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్ర నిరాశ పరుస్తున్నాడు. అంతేకాకుండా సీనియర్ ప్లేయర్లు, నిపుణుల నుంచి భారీ విమర్శలు ఎదుర్కొంటున్నాయి. కానీ తాజాగా పాక్‌తో జరగనున్న మ్యాచ్‌తో కోహ్లీ సరికొత్త రికార్డ్ సృష్టించనున్నాడు. ఈ రికార్డ్ చేయడానికి కోహ్లీ భారీ పరుగులు చేయాల్సిన అవసరం లేదు, నెవ్వర్ బిఫోర్ అనేలా క్యాచులు పట్టడం, అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మ్యాచ్‌లో ఆడితే చాలు.
ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న చిరాక ప్రత్యర్థుల మ్యాచ్‌తో కోహ్లీ రికార్డ్ చేయనున్నాడు. ఈ మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో ఆడనున్న 100వ టీ20 కానుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడటం ద్వారా మూడు ఫార్మాట్‌లలో 100 మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి భారతీయ ఆటగాడిగా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు కోహ్లీ 99 టీ20 మ్యాచుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. టీ20ల్లో కోహ్లీ 50.12 సగటుతో 3,308 పరుగులు చేశాడు. అంతేకాకుండా టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ బెస్ట్ స్కోర్ 94 కాగా, 30 అర్ధ శతకాలు చేశాడు.
ఇవి కూడా చదవండి : Asia Cup: పాక్ టీంలో వాళ్లు లేకపోవడం Rohith Sharma అదృష్టం: రాజ్‌కుమార్