ఉజ్జయినిలో కోహ్లీ దంపతుల పూజలు

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్‌ల్లో మాత్రం ఆ జోరును చూపించలేకపోతున్నాడు.

Update: 2023-03-04 09:12 GMT
ఉజ్జయినిలో కోహ్లీ దంపతుల పూజలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్‌ల్లో మాత్రం ఆ జోరును చూపించలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు. మూడు టెస్ట్‌ల్లో కలిపి ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఢిల్లీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 44 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ఇండోర్ వేదికగా శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లోనూ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు.

పేలవ ఫామ్ లేదా మరేదైనా కారణమో తెలియదు కానీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి శనివారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహా కాలేశ్వర ఆలయాన్ని సందర్చించాడు. సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించాడు. మహాకాళేశ్వర్‌ ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే శివుడికి భస్మా హారతి ఇస్తారు. ఈ కార్యక్రమంలో కోహ్లీ, అనుష్క దంపతులు పాల్గొన్నారు. నవగ్రహా పూజ కూడా చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అహ్మదాబాద్ టెస్ట్‌లోనైనా పరుగులు చేసే అవకాశం కల్పించాలని ఆ దేవుడిని కోహ్లీ కోరుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News