టీమిండియా కోచ్ పదవిపై జస్టిన్ లాంగర్ సెన్సేషనల్ కామెంట్స్
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న ఈ టీ-20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవి కాలం
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న ఈ టీ-20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగియనుంది. ఇప్పటికే రాహుల్‌కు ఒకసారి పదవి కాలం పెంచిన బీసీసీఐ.. ఈ సారి మాత్రం కొత్త కోచ్‌ను నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆశావహుల నుండి దరఖాస్తులు సైతం స్వీకరించింది. దీంతో టీమిండియా నెక్ట్స్ హెడ్ కోచ్ ఎవరా అని క్రికెట్ ప్రియుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హెడ్ కోచ్ రేసులో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నాయి.
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, జస్టిన్ లాంగర్, వీవీఎస్ లక్ష్మణ్‌ల పేర్లు హెడ్ కోచ్ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ పదవిపై లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జస్టిన్ లాంగర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ స్పోర్ట్స్ చానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఫ్యాన్స్, జట్టుపై అంచనాలు ఉన్న టీమిండియా జట్టుకు హెడ్ కోచ్‌గా పని చేయడం అతిపెద్ద సవాల్ అని లాంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది అభిమానులు అనుసరిస్తున్న భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి ఒత్తిడితో కూడుకుని ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా టీమిండియా హెడ్ కోచ్ పదవి సరదాగా, ప్రతిష్టాత్మకంగా ఉంటుందన్నారు. అలాంటి పదవి సాధించడం కూడా క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనత అని లాంగర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత హెడ్ కోచ్ రేసులో మీరు ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు లాంగర్ సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. కాగా, ప్రస్తుతం ఐపీఎల్, వరల్డ్ కప్ బిజీలో ఉన్న బీసీసీఐ పొట్టి ప్రపంచ కప్ అయిపోయాక భారత్ హెడ్ కోచ్ సెలక్షన్‌పై దృష్టి పెట్టనుంది. దీంతో రాహుల్ ద్రావిడ్ తర్వాత నెక్ట్స్ టీమిండియా హెడ్ కోచ్ పదవి ఎవరికి దక్కుతుందా అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.