Olympics: చరిత్రలో మొదటి సారి.. ఆ దేశానికి మొట్టమొదటి పతకం

పారిస్ ఒలింపిక్స్ లో చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు పతకాల వేటను కొనసాగిస్తున్నాయి.

Update: 2024-08-04 08:19 GMT

దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు పతకాల వేటను కొనసాగిస్తున్నాయి. కానీ నేటికీ కొన్ని దేశాలు ఒక్క పతకం అయినా సాధించాలనే తపన తో ఉన్నాయి. ఈ క్రమంలోనే సెయింట్ లూసియాకు తొలి ఒలింపిక్ మెడల్ సాధించిన జూలియన్ ఆల్ఫ్రెడ్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో 10.72 సెకన్లలో రేస్ పూర్తి చేసిన ఆల్ఫ్రెడ్ బంగారు పతకం గెలుచుకుంది. దీంతో ఒకే సారి తమ దేశానికి పతకం సాధించాలని కలతో పాటు ఏకంగా రన్నింగ్ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ కలను ఆల్ఫ్రెడ్ నెరవేర్చుకుంది. దీంతో ఆ దేశ ప్రజల ఆనందం లో మునిగిపోయారు. అలాగే దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

ఒలింపిక్స్ మెడల్స్ ట్యాలి

 


Similar News