IRE vs IND : భారత్ కు 239 లక్ష్యం నిర్ధేశించిన ఐర్లాండ్
ఐర్లాండ్ - ఇండియా మహిళా(Ireland Women vs India Women) క్రికెట్ల జట్ల మధ్య జరుగుతున్న తొలి ద్వైపాక్షిక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరగుతున్న మొదటి వన్డే(1st ODI) లో ఐర్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 7వికెట్లకు 238పరుగులు చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : ఐర్లాండ్ - ఇండియా మహిళా(Ireland Women vs India Women) క్రికెట్ల జట్ల మధ్య జరుగుతున్న తొలి ద్వైపాక్షిక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరగుతున్న మొదటి వన్డే(1st ODI) లో ఐర్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 7వికెట్లకు 238పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో గాబి లేవిస్ (92), లేహ్ పాల్ (59)పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో ప్రియామిశ్రా 2 వికెట్లు, సాధు, సయాలి, దీప్తి శర్మలు తలో వికెట్ సాధించారు.
239పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 16 ఓవర్ల సమయంలో ఒక వికెట్ నష్టానికి 93పరుగులు చేసింది. భారత కెప్టెన్ స్మృతి మంధాన 29బంతుల్లో 41పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ప్రస్తుతం క్రీజులో ప్రతీక్ రావల్ 30, హర్లీన్ డియోల్ 16పరుగులతో ఆడుతున్నారు.