స్వేచ్ఛగా ఆడాలనుకుంటున్నా.. లక్నోను వీడటంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను రిటైన్ చేసుకోలేదు.
దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను రిటైన్ చేసుకోలేదు. దీంతో లక్నో ఓనర్ రాహుల్‌ను తప్పించాడని, రాహులే లక్నోతో కొనసాగడానికి ఇష్టపడలేదని పలు వార్తలు వచ్చాయి. తాజాగా లక్నోను వీడటంపై కేఎల్ రాహుల్ తొలిసారిగా స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వేచ్ఛగా ఆడేందుకు కొత్త ఆప్షన్లను అన్వేషించాలనుకుంటున్నట్టు తెలిపాడు.‘కొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్నా. నా ఎంపికలను అన్వేషించాలనుకున్నా. స్వేచ్ఛ దొరికే చోటుకు వెళ్లి ఆడాలనుకుంటున్నా. కొన్ని సందర్భాల్లో దూరంగా వెళ్లి మనం కోసం మంచిదాన్ని వెతుక్కోవాలి.’ అని తెలిపాడు.
రాహుల్ జాతీయ టీ20 జట్టులో చోలు కోల్పోయి రెండేళ్లు అవుతంది. 2022 నవంబర్‌లో ఇంగ్లాండ్‌పై ఆఖరి మ్యాచ్ ఆడాడు. టీ20 జట్టులోకి పునరాగమనం చేయడానికి వచ్చే ఐపీఎల్ సీజన్‌ను రాహుల్‌ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. ‘కొంతకాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉన్నాను. ప్లేయర్‌గా ఎక్కడో ఉన్నానో, జట్టులోకి తిరిగి రావడానికి ఏం చేయాలో నాకు తెలుసు. క్రికెట్‌ను ఆస్వాదించడానికి ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నా. టీ20 జట్టులో తిరిగి చోటు సంపాదించడమే నా లక్ష్యం.’అని రాహుల్ చెప్పుకొచ్చాడు. కాగా, రాహుల్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నాడు. అతను భారీ ధర పలికే అవకాశం ఉంది.