కొన్నిసార్లు పరిస్థితులు చాలా బాధిస్తాయి : భారత అథ్లెట్ జ్యోతి యర్రాజి

దిశ,స్పోర్ట్స్ : భారత్ తరఫున పారిస్ ఒలింపిక్స్ -2024లో పాల్గొంటున్న అథ్లెట్, తెలుగు అమ్మాయి జ్యోతి యర్రాజి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Update: 2024-07-17 18:58 GMT

దిశ,స్పోర్ట్స్ : భారత్ తరఫున పారిస్ ఒలింపిక్స్ -2024లో పాల్గొంటున్న అథ్లెట్, తెలుగు అమ్మాయి జ్యోతి యర్రాజి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘నేను ప్రతీ హార్దిల్ ఫినిష్ లైన్ దాటే క్షణం కుటుంబంలోని కష్టాలు, బాధలను వెనక్కి నెట్టినట్లు అనిపిస్తుంది. కుటుంబం నిలదొక్కుకోవడానికి మా తల్లి విశాఖపట్టణంలోని ఓ ఆస్పత్రిలో డొమెస్టిక్ హెల్పర్, క్లీనర్‌గా డబుల్ షిఫ్ట్ చేసేది.అలాగే నేను కూడా పారిస్ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హార్డిల్ ఫినిష్ లైన్ క్రాస్ చేసే సమయంలో మా తల్లి కష్టపడేతత్వం, పాజిటివ్ మైండ్‌సెట్‌ను గుర్తుకుతెచ్చుకుంటాను. ఎందుకంటే కొన్నిసార్లు పరిస్థితులు చాలా బాధిస్తాయి. గతంలో నా కుటుంబం, నా జీవితం గురించి చాలా ఆలోచించడంతో పాటు బాధపడేదాన్ని. నా కుటుంబ నేపథ్యం మరియు వ్యక్తిగత జీవితం నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను’ అని జ్యోతి చెప్పుకొచ్చింది. కాగా, వరల్డ్ ర్యాంకింగ్ కోటా ద్వారా జ్యోతి పారిస్ ఒలింపిక్స్ -2024కు ఎంపికవ్వడమే కాకుండా, 100 మీటర్ల హార్దిల్స్‌లో పాల్గొననున్న తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించనుంది.


Similar News