IND vs WI: రేపటి నుంచి విండీస్‌తో వన్డే సిరీస్.. అదే జోరు కొనసాగేనా..?

వర్షం కారణంగా రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్న టీమ్ ఇండియా

Update: 2023-07-26 17:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: వర్షం కారణంగా రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్న టీమ్ ఇండియా.. గురువారం నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధం కానుంది. టెస్ట్ సిరీస్ గెలిచిన ఉత్సాహంతో వ‌న్డే సిరీస్‌లో టీమ్ ఇండియా బ‌రిలోకి దిగుతోంది. ఆసియా కప్‌ టోర్నీకి ముందు భారత్‌ ఆడే చివరి వన్డే సిరీస్‌ ఇదే. ఆ తర్వాత వచ్చే వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్‌ను టీమ్‌ ఇండియా సద్వినియోగం చేసుకోవాలి.

టెస్టుల్లో కనీసం పోరాడలేకపోయిన విండీస్‌ను ఈసారి తక్కువగా అంచనా వేయకూడదు. స్టార్లతో కూడిన జట్టునే ఎంపిక చేయడంతో పోరు రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. భారత్‌, విండీస్‌ల మధ్య తొలి రెండు వన్డేలు ఈ నెల 27, 29వ తేదీల్లో కింగ్‌స్టన్‌లో జరుగుతాయి. ఆగస్టు 1న మూడో వన్డేకు ట్రినిడాడ్‌ ఆతిథ్యమిస్తుంది. వన్డేల తర్వాత రెండు జట్లు అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతాయి.

భారత్ జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, జయ్‌దేవ్ ఉనద్కత్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్‌ కుమార్‌

విండీస్‌ జట్టు:

షై హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్‌ కెప్టెన్), అలిక్ అథనేజ్, యనిక్ కారియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రోన్ హెట్‌మయేర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కేల్‌ మేయర్స్, మోతీ, జయ్‌దెన్ సీలెస్, రొమారియో షెఫెర్డ్, కెవిన్‌ సిన్‌క్లెయిర్‌, ఓషానె థామస్.


Similar News