IND Vs SA 2nd T20 : రేపు భారత్ Vs సౌతాఫ్రికా సెకండ్ టీ20.. ఆ ఇద్దరు ఆటగాళ్లపైనే ఫోకస్..!

సౌతాఫ్రికాతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు(ఆదివారం) ఇండియా రెండో మ్యాచ్‌లో ప్రొటియస్ జట్టుతో తలపడనుంది.

Update: 2024-11-09 14:17 GMT

దిశ, స్పోర్ట్స్ : సాతాఫ్రికాతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు(ఆదివారం) ఇండియా రెండో మ్యాచ్‌లో ప్రొటియస్ జట్టుతో తలపడనుంది. డర్బన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సంజు శాంసన్ 50 బంతుల్లో 107 పరుగులు చేసి రాణించడంతో టీమిండియా 61 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో ‘కీ’ రోల్ పోషించారు. అయితే తొలి మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైంది.

సీనియర్లు లేక సౌతాఫ్రికా ఢీలా!

మరో వైపు సౌతాఫ్రికా కీలకమైన ఆటగాళ్లు క్వింటన్ డికాక్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే మరియు తబ్రేజ్ షంషీ లేకపోవడంతో ఇబ్బందులు పడింది. ఫామ్ లేమితో బాధపడుతున్న సాతాఫ్రికా జట్టు వెస్టీండిస్‌తో సిరీస్‌ కోల్పోవడంతో పాటు ఐర్లాండ్‌తో సిరీస్‌ను డ్రా చేసుకుంది. సౌతాఫ్రికా జట్టు రెండో టీ20లో గెలవాలంటే సీనియర్లు మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ రాణించాల్సిందే. టీంఇండియాలో ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్‌లో వరుసగా తడపడటం ఇబ్బందిగా మారింది. అందివచ్చిన అవకాశాలను భారీ స్కోర్లు మలచడంలో ఈ ఓపెనర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ విఫలం అవుతున్నాడు. అయితే తొలి మ్యాచ్‌లో తిలక్ వర్మ వేగంగా 33 పరుగులు చేసి రాణించాడు.

సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్లతో కూడిన మిడిల్ ఆర్డర్ మంచి ఆరంభం లభించిన తర్వాత తడబడింది. దీంతో భారత్ కేవలం 36 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఒక్క సారిగా మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ కుప్పకూలడంతో ప్రశ్నలు తలెత్తాయి. ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలో మూడు వికెట్లు రాబట్టి సౌతాఫ్రికాను 141 పరుగుల వద్ద నిలువరించడంలో కీలక పాత్ర పోషించడం భారత్‌కు అనుకూలంగా మారింది. అర్షదీప్, ఆవేశ్ ఖాన్ బంతితో సౌతాఫ్రికా బ్యాటర్లను ఇబ్బంది పెట్టి స్ట్రాంగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. దీంతో రెండు టీ20లో ఎలాగైనా గెలిచి 2-0 ఆధిక్యం సాధించాలని టీమిండియా భావిస్తోంది.

ఫోకస్ అంతా ఆ ఇద్దరు ఆటగాళ్లపైనే..!

టీ20ల్లో రెండు వరుస సెంచరీలు చేసి ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్ ఓపెనింగ్‌లో అందుబాటులోకి వచ్చే వరకు బరిలోకి దిగిన సంజు శాంసన్ వరుసగా రెండు సెంచరీలు చేశాడు. దీంతో రానున్న రోజుల్లో జట్టు మేనేజ్‌మెంట్‌కు సెలక్షన్ సవాల్ కానుంది. సౌతాఫ్రికాలో హెన్రిచ్ క్లాసెన్ తొలి టీ20 మ్యాచ్‌లో 22 పరుగులకే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔట్ అయి నిరాశ పర్చాడు. అయితే క్లాసెన్ ఫామ్ లోకి వస్తే టీమిండియాకు ఇబ్బందులు తప్పవు.

సెకండ్ టీ20 ఎక్కడ చూడొచ్చంటే..!

ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 సెయింట్ జార్జ్ పార్క్ గ్వెబెర్హాలో నేడు(ఆదివారం) జరగనుంది. మ్యాచ్ 7.30కు ప్రారంభం కానుంది. స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18 1 హెచ్‌డీ, కలర్స్ సినీ ప్లెక్స్ ఛానెల్స్‌లో మ్యాచ్ ప్రసారం కానుంది. ఫ్యాన్స్ జియో సినిమా యాప్, వెబ్ సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

టీ20ల్లో పై చేయి ఎవరిదంటే..?

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా తలపడిన మ్యాచ్‌లు : 28

ఇండియా గెలిచినవి : 16

సౌతాఫ్రికా గెలిచినవి : 11

ఫలితం తేలని మ్యాచ్‌లు : 1

పిచ్ రిపోర్ట్..

రెండో టీ20కి వేదిక సెయింట్ జార్జ్‌లో పిచ్ బ్యాలెన్సింగ్‌గా ఉండనుంది. మొదట్లో బ్యాటర్లకు పిచ్ అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ గడిచేకొద్ది స్పిన్ బౌలర్లు పట్టు సాధిస్తారు. టాస్ గెలిచిన జట్లు ఇక్కడ మొదట బ్యాటింగ్ ఎంచుకుంటాయి.

IND Vs SA : ప్లేయింగ్ 11

ఇండియా : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, విజయ్ కుమార్ వైశక్, ఆవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్

సౌతాఫ్రికా : అడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, ర్యాన్ రిక్టెల్‌టన్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ సీయోట్జీ, ఎంకబా పీటర్, ఓట్నియల్ బార్ట్ మెన్

Tags:    

Similar News